TDP Manifesto Copy: చంద్రబాబు మేనిఫెస్టో ఒక కాపీక్యాట్: సీఎం జగన్

ఇటీవల టీడీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
TDP Manifesto

New Web Story Copy 2023 06 01t194441.193

TDP Manifesto Copy: ఇటీవల టీడీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) టీడీపీ మేనిఫెస్టోని కాపీగా చిత్రీకరించారు. టీడీపీ మేనిఫెస్టో అచ్చం వైఎస్సార్‌సీపీ పథకాలతో సహా కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌లు చేసిన ఎన్నికల మేనిఫెస్టోలా ఉందని అన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పధకాలను ఇతర పార్టీలు కాపీ కొట్టారని చంద్రబాబుని ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(CBN)ని దుయ్యబట్టారు.

చంద్రబాబు మేనిఫెస్టో (TDP Manifesto) ఆంధ్రా రాష్ట్రంలో పుట్టలేదని, అది కర్ణాటకలో పుట్టిందన్నారు సీఎం జగన్. కర్నూలు జిల్లా పత్తికొండ బహిరంగ సభలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మ ఒడి’, ‘చేయుతా’ మరియు ‘రైతు భరోసా’ వంటి వైఎస్‌ఆర్‌సిపి అన్ని పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని విమర్శించారు సీఎం జగన్. చంద్రబాబుకి వ్యక్తిత్వం, విశ్వసనీయత లేదని మండిపడ్డారు.

ఇదిలా ఉండగా.. చంద్రబాబు ఇచ్చిన హామీలలో భవిష్యత్తు హామీ పథకం కింద 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలవారీ రూ.1,500 నగదు భృతి, వివిధ ప్రభుత్వ శాఖల్లో యువ గళం పథకం కింద యువతకు 20 లక్షల ఉద్యోగాలు, యువ గళం ఫండ్ కింద నెలవారీ రూ.3,000 నిరుద్యోగ భృతి, వార్షికంగా రూ.20,000. రైతులకు వారి వ్యవసాయ ఖర్చులకు నగదు భత్యం ఇలా అనేక హామీలను చంద్రబాబు ప్రకటించారు.

Read More: YSR Rythu Bharosa: 52.3 లక్షల మంది రైతుల అకౌంట్లోకి రూ.5,500 జమ

  Last Updated: 01 Jun 2023, 07:44 PM IST