Jagan : రేపు అన్నమయ్య, కడప జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు

Published By: HashtagU Telugu Desk
Jagan Apologie

Jagan Apologie

సీఎం జగన్ (CM Jagan) రేపు , ఎల్లుండి అన్నమయ్య, కడప జిల్లాల్లో (annamayya kadapa district) పర్యటించబోతున్నారు. ఈ మేరకు జగన్ పర్యటన కు సంబదించిన వివరాలు అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యల వివాహ వేడుకలో పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుని శ్రీకృష్ణుడి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని, ఆ తర్వాత పులివెందుల శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. అనంతరం శ్రీ స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌కు శంకుస్ధాపన కార్యక్రమం, ఆ తర్వాత ఏపీ కార్ల్‌ ప్రాంగణంలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కళాశాలలు, స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ సెంట్రల్‌ టెస్టింగ్‌ లేబరేటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ల్యాబ్‌లు ప్రారంభోత్సవం, ఆదిత్య బిర్లా యూనిట్‌ విజిట్, ఆ తర్వాత సీవీ సుబ్బారెడ్డి నివాసానికి వెళతారు. అక్కడినుంచి బయలుదేరి ఇడుపులపాయ చేరుకుని వైస్సార్ ఎస్టేట్‌ గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.

ఎల్లుండి ఉదయం ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయలో ఆర్‌ కే వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎకో పార్క్‌ వద్ద వేముల మండలం ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్ననికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Read Also : Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు

  Last Updated: 08 Nov 2023, 08:58 PM IST