నేటితో ఎన్నికల ప్రచారానికి తెరపడునున్న విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర రోజులుగా నిర్విరామంగా వివిధ పార్టీల నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పోలింగ్ రెండు రోజుల ముందే ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది. అయితే.. ఈ ప్రచారంలో ప్రత్యర్థులు విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ.. ప్రజలను తమవైపు మళ్లించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉన్నవిలేని విమర్శలు సైతం ప్రత్యర్థులపై గుప్పించారు. అయితే.. దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నా.. ఏపీలో మాత్రం రాజకీయం మరోలా ఉంది. ఇక్కడి రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అయితే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పాలనకు విసుగుచెందిన జనం జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు సిద్ధమయ్యారని ప్రధాన ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తుండగా.. కాంగ్రెస్ సైతం వైసీపీ వైపే విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్న అని కూడా చూడకుండా.. తనదైశ శైలిలో జగన్‌పై విమర్శనస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి తోడు ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యపై వైఎస్ సునీత సైతం సొదరుడు జగన్‌ను వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ క్రమంలోనే నిన్న సీఎం జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ షర్మిలారెడ్డి తన అన్నపై ఎవరూ ఊహించనంత ఎక్కువగా దాడి చేయడం అటు పార్టీని, ఇటు జగన్ ను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. వివేకా హత్యకు సంబంధించి షర్మిల, సునీత అడిగిన ప్రశ్నలకు జగన్ స్పందిస్తూ.. తనను, ఆయన కుటుంబ వ్యవహారాల్లో ఇరికించి, వారి వెనుక సీబీఎన్ హస్తం ఉందని పేర్కొన్నారు.
అక్కడితో ఆగకుండా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని చంద్రబాబు రిమోట్ కంట్రోల్‌లో ఉంచుతున్నారని జగన్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఓ విలేకరి సీఎం రేవంత్‌ని ప్రశ్నించగా.. ‘నాపై వ్యాఖ్యానించే ముందు జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి’ అని నవ్వుతూ అన్నారు రేవంత్.. “అవును, నాకు చంద్రబాబు అంటే గౌరవం ఉంది, కానీ రాజకీయ సంబంధం లేదు. నేను బంధాన్ని తెంచుకుని 2017లో కాంగ్రెస్‌లో చేరాను మరియు నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యాను. నా విధేయత స్పష్టంగా నా కాంగ్రెస్ పార్టీ పట్ల ఉంటుంది. ఏపీలో షర్మిలకు తప్పకుండా మద్దతు ఇస్తాను’’ అని రేవంత్ అన్నారు. ముందు ‘కన్నతల్లి’కి, సొంత చెల్లికి జగన్ సమాధానం చెప్పాలి’ అని రేవంత్ అన్నారు. ముందు మీ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి’’ అన్నారు.
Read Also : Allu Arjun : వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ఎందుకు మద్దతు ఇస్తున్నాడు.?