Site icon HashtagU Telugu

CM Revanth Reddy : కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

CM Revanth Reddy appeal to the central team

CM Revanth Reddy appeal to the central team

CM Revanth Reddy appeal to the central team: రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై నేడు సచివాలయంలో కేంద్ర బృందంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు. మున్నేరు వాగుకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.

Read Also: Kohli Joins Team India: లండన్ నుంచి చెన్నైకు, కేంద్రమంత్రి స్థాయి భద్రత

ఇటీవల కాలంలో సంభవించిన వరదలకు తెలంగాణ రాష్ట్రం తీవ్రస్థాయిలో నష్టపోయిందని బృందానికి గణాంకాలతో సిఎం వివరించారు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయని, . అనేక ఇళ్లు నీటిలో మునిగిపోయి ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. ఇండ్లు , పంటలు నష్టపోయి ఆర్థికంగా నష్టపోయారన్నారు. అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు మానవీయ కోణంలో కేంద్రం పెద్ద మొత్తంలో సాయం చేసి ఆదుకోవాలని రేవంత్ కేంద్ర బృందాన్ని కోరారు. కాగా, రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరద నష్టం అంచనాకు జాతీయ విపత్తు నిర్వాహణ సంస్థ అడ్వయిజర్ కల్నల్ కేపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి చేసుకుని, శుక్రవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యింది.

Read Also:Gujarat Titans New Owner: కొత్త ఓన‌ర్‌తో బ‌రిలోకి దిగ‌నున్న గుజ‌రాత్ టైటాన్స్‌..?