Site icon HashtagU Telugu

CM Ramesh : ఏ ఒక్కడిని వదిలిపెట్టనని సీఎం రమేష్ వార్నింగ్..

Ycp Attack Cm Ramesh

Ycp Attack Cm Ramesh

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ నేతలు (YCP Leaders) , వర్గీయులు రెచ్చిపోతున్నారు. శనివారం అనకాపల్లి (Anakapalli) జిల్లా మాడుగుల మండలం తాడువలో కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, డిప్యూటి సీఎం బూడి ముత్యాలనాయుడు, కొందరు కార్యకర్తలను వెంటబట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగాడు. బీజేపీ నాయకుడు గంగాధర్‌ని చెప్పుతో కొట్టి, రెండు ద్విచక్రవాహనాలు ధ్వసం చేశారు. ఈ దాడిలో నలుగురు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ (CM Ramesh) ఫై వైసీపీ కి చెందిన వర్గీయులు దాడి చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ దాడిలో రమేష్‌కు స్వల్పగాయాలవ్వగా.. చొక్కా చిరిగిపోయింది. అలాగే ఆయన కారుతో పాటు కాన్వాయ్‌లోని మూడు కార్లపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. వైసీపీ కి చెందిన వర్గీయులు రెచ్చిపోతూ దాడి చేస్తున్న పోలీసులు వారిని ఆపడం కానీ చేయపోవడంఫై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడి చేసిన వారంతా ఇసుక దోపిడీ, మైనింగ్ దందాలకు పాల్పడిన వారేనని సీఎం రమేష్ ఆరోపించారు. తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.

Read Also : Mayor Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ ప్లెక్సీ లలో తన ఫోటో లేదని మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం..