CM Post Record : గురువుని మించిన శిష్యుడు

`గురువుని మించిన శిష్యుడు..` అనేది తెలుగు పాపుల‌ర్ సామెత‌. దాన్ని చంద్ర‌బాబు, కేసీఆర్ కు వ‌ర్తింప చేస్తే అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 12:44 PM IST

`గురువుని మించిన శిష్యుడు..` అనేది తెలుగు పాపుల‌ర్ సామెత‌. దాన్ని ఇప్పుడు చంద్ర‌బాబు, కేసీఆర్ కు వ‌ర్తింప చేస్తే అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతుంది. ఎందుకంటే, చంద్ర‌బాబునాయుడు రికార్డ్ ను కేసీఆర్ బ్రేక్ (CM Post Record) చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు రాష్ట్ర‌ల్లో అత్య‌ధికంగా సీఎం ప‌ద‌విని నిర్వ‌హించిన రికార్డ్ చంద్ర‌బాబు ఖాతాలో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డ్ ను కేసీఆర్ బ్రేక్ చేస్తూ మొద‌టి ర్యాంకును కొట్టేశారు. అయితే, ఉమ్మ‌డి ఏపీలో అత్య‌ధిక కాలం సీఎంగా కొన‌సాగిన రికార్డ్ మాత్రం చంద్ర‌బాబు సొంతం. దాన్ని ఎవ‌రూ చెరిపేయ‌లేరు.

చంద్ర‌బాబునాయుడు రికార్డ్ ను కేసీఆర్ బ్రేక్ (CM Post Record)

ఉమ్మ‌డి ఏపీలో చంద్ర‌బాబునాయుడు ఏక‌బిగిన 8ఏళ్ల 256 రోజులు సీఎంగా ఉన్నారు. ఆయ‌న త‌రువాత స్థానంలో కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి 7ఏళ్ల 221 రోజులు సీఎంగా కొన‌సాగారు. మూడో స్థానంలో ఉన్న వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డి 5 ఏళ్ల 111 రోజులు పాటు సీఎం ప‌దవిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల సీఎంల రికార్డ్ ను తీసుకుంటే ఎక్క‌వ కాలం సీఎంగా ఉన్న రికార్డ్ (CM Post Record) ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఖాతాలో ఉండేది. ఆయ‌న 13ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. ఆ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ కేసీఆర్ ఏక‌బిగిన 8ఏళ్ల 256 రోజులు దాటారు. ఇంకా ఆయ‌న సీఎంగా కొన‌సాగుతున్నారు. అంటే, ఏక‌బిగిన సీఎంగా కొన‌సాగిన తెలుగు రాష్ట్రాల్లో సీఎంల‌లో కేసీఆర్ నెంబ‌ర్ 1 గా నిలిచారు.

సీఎంగా కొన‌సాగిన తెలుగు రాష్ట్రాల్లో సీఎంల‌లో కేసీఆర్ నెంబ‌ర్ 1

మాజీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్ద‌రూ స‌మ‌కాలీకులు. యువ‌జ‌న కాంగ్రెస్ నుంచి రాజ‌కీయంగా ఎదిగారు. అయితే, చంద్ర‌బాబు ముందుగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి అడుగుపెట్టారు. యుక్త‌వ‌య‌స్సులోనే మంత్రి ప‌ద‌విని నిర్వహించారు. యంగెస్ట్ మంత్రిగా ఉమ్మ‌డి ఏపీ క్యాబినెట్లో 1980ల్లోనే పేరొందారు. ఆల‌స్యంగా రాజ‌కీయంగా ఎదిగిన కేసీఆర్ మాత్రం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌లువ‌తో చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ప‌నిచేశారు. అందుకే, వాళ్లిద్ద‌రి మ‌ధ్యా గురుశిష్యుల బంధం ఉందంటారు. చంద్ర‌బాబు క్యాబినెట్లో స్థానం ఇవ్వ‌క‌పోవ‌డంతో కేసీఆర్ టీడీపీకి దూర‌మ‌య్యారు. చంద్ర‌బాబు కు వ్య‌తిరేకంగా రాజ‌కీయ పావులు క‌దిపారు.

Also read : TDP Manifesto: చంద్రబాబు ఎన్నికల శంఖారావం! తొలి మేనిఫెస్టో ఇదే

ప్ర‌త్యేక ఉద్య‌మం ఆయ‌న రాజ‌కీయ జీవితానికి క‌లిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీ చ‌లువ‌తో ఆయ‌న ఉద్య‌మ‌నాయ‌కునిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చార‌ని అంద‌రికీ తెలుసు. కానీ, కేసీఆర్ ఉద్య‌మం కార‌ణంగా తెలంగాణ వ‌చ్చింద‌ని లిట‌రేచ‌ర్ వ‌చ్చేసింది. దాన్నే తెలంగాణ స‌మాజం న‌మ్మింది. కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్ట‌డం ద్వారా కేసీఆర్ కు రెండుసార్లు ప‌ట్టంక‌ట్టింది. ఆ క్ర‌మంలో పాత శ‌తృత్వాన్ని చంద్ర‌బాబు మీద కేసీఆర్ తీర్చుకున్నారు. గురువును మించిన శిష్యునిగా రాజ‌కీయ‌వాసికెక్కారు. అత్య‌ధిక‌కాలం ఏక‌బిగిన సీఎం ప‌ద‌విని నిర్వ‌హించిన రికార్డుల్లో ఉన్న చంద్ర‌బాబును వెన‌క్కు (CM Post Record) నెట్టారు. ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం సీఎం ప‌ద‌విని ఏక‌బిగిన అనుభ‌వించిన వాళ్ల జాబితాలో కేసీఆర్ నిలిచారు.

Also Read : CBN P4 Formula :విజ‌న్ 2047కు చంద్ర‌బాబు పీ4 ఫార్ములా