Site icon HashtagU Telugu

KCR-Chandrababu : ఒకే వేదికపైకి ఇద్దరు చంద్రులు

kcr chandrababu

kcr chandrababu

CM k ఆశీనులు కానున్నారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతిని పురస్కరించుకొని ఇడియన్ నేషనల్ లోక్‌దళ్ ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి తెలంగాణ సీఎం కేసార్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఐఎస్ఎల్‌డీ ఆహ్వానించింది. దీంతో ఒకే వేదికపై ఇద్దరు చంద్రులు కనువిందు చేయనున్నారు. వీరితో పాటు దేశంలో పలువురు కీలక నేతలను ఆహ్వానిస్తున్నట్లు ఐఎస్ఎల్‌డీ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా వెల్లడించారు.

ఒకే స్టేజీపై ప్రతిపక్ష నేతలందరూ..

ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యలపై చర్చించనున్నట్టు చెప్పారు. బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని..అందుకోసమే ప్రతిపక్ష నేతలను ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఎస్ఎల్‌డీ నేతలు వెల్లడించారు. ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా తెలిపారు.