Site icon HashtagU Telugu

Achchennaidu: సీఎం జగన్‌ పిచ్చి పరాకాష్టకు చేరింది: అచ్చెన్నాయుడు

Achchennaidu

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

Achchennaidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని (Chandrababu Naidu) అరెస్టు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achchennaidu). ఏసీ సీఎం జగన్‌కి పిచ్చి పరాకాష్టకు చేరిందన్న ఆయన.. 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన చంద్రబాబును అరెస్టు చెయ్యడమేంటని ప్రశ్నించారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చంద్రబాబు సేవల్ని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్నారన్న అచ్చెన్నాయుడు .. “చంద్రబాబు ఉగ్రవాది కాదు, పారిపోరు, దాక్కొని తప్పించుకునే వ్యక్తి కాదు. కేంద్రం ఇచ్చిన NSG ప్రొటెక్షన్ కలిగిన వ్యక్తి, అలాంటి ఆయన పట్ల ఇలా ప్రవర్తించి, ప్రతి ఒక్కరూ అసహ్యించుకునేలా చేశారు” అని అన్నారు. “ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు.. ఏపీని చీకట్లోకి నెట్టారు” అని మండిపడ్డారు.

ఐదేళ్లు స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టుతో ఉద్యోగాలు పొందారు. రూ.380 కోట్లు అవినీతి జరిగిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించారు. ఇంత దారుణంగా అరెస్ట్ చేయడాన్ని ప్రజలంతా గమనించాలి. చట్టం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు.. కేవలం రాజకీయ కక్షతోనే ప్రతిపక్షంపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.

Also Read: AP Governor : నిర్ణయం మార్చుకున్న గవర్నర్.. టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ రద్దు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌లో అవినీతి జరిగిందనే అభియోగాలతో ఏపీ సీఐడీ పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు. చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదైంది.