Site icon HashtagU Telugu

YS Jagan: వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి…

Cm Jaganmohan Reddy Is Taking Steps With Y Not 175 Slogan

Cm Jaganmohan Reddy Is Taking Steps With Y Not 175 Slogan

 

lok sabha candidates :ఏపిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత జగన్(jagan) ముందుకెళ్తున్నారు. వై నాట్ 175 నినాదంతో అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అభ్యర్థులు మార్పులు చేర్పులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏడు దశల్లో 65 మందికి పైగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసిన సీఎం జగన్.. పార్లమెంట్ స్థానాల పరిధిలో ఇద్దరు అభ్యర్థులను కొనసాగిస్తూనే 14 మందిని కొత్తవారిని ఇంచార్జిలుగా నియమించారు.

ఇక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న మిగతా వాటిపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్ ల పరిధిలో ఏడు దశల్లో 65 మందిపైగా అభ్యర్థులను మార్పులు చేశారు. ఇక పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో 16 మందిని ఇప్పటికే ఫైనల్ చేసిన సీఎం జగన్.. ఇప్పటి వరకు నియమించిన 16 స్థానాల్లో 14 మందిని కొత్తవారిని నియమించగా రెండు పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో సిట్టింగ్ లకు అవకాశం కల్పించారు.

We’re now on WhatsApp. Click to Join.

తిరుపతి నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని, చిత్తూరు నుంచి సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పను కొనసాగిస్తూ వారిని అభ్యర్థులుగా ప్రకటించారు. ఇప్పటివరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో సీరియస్ గా కసరత్తు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్‌లో ఉన్న అన్ని స్థానాలను త్వరలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుని పార్లమెంట్ సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో అభ్యర్థుల ఎంపిక కోసం ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

ముఖ్యంగా పార్లమెంట్ సెగ్మెంట్స్ పరిధిలో సిట్టింగుల పనితీరు, ఎమ్మెల్యేలతో సఖ్యత, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే మిగతా 9 పార్లమెంటు స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంపిక కోసం అనౌన్స్ చేసే పనిలో సిఎం జగన్‌ నిమగ్నమై ఉన్నారు.

read also : Saralasagar Project : తెలంగాణలో ఏ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రో కూడా ఉత్తమ్ కు తెలియదు – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి