Jagan : రేపు పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ

ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 05:34 PM IST

ఎన్నికలకు ఇంకా నెల కూడా సమయం లేకపోవడం తో జగన్ (Jagan) తన ప్రచారం ఫై ఇంకాస్త ఫోకస్ చేస్తూనే మేనిఫెస్టో (YCP Manifesto 2024) ఫై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ మేరకు రేపు పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మేనిఫెస్టో కు సంబంధించి నేతలతో చర్చించబోతున్నారు. అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేసిన జగన్.. ఈ నెల 25న తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 26, 27 తేదీల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో నవరత్నాలు పేరిట మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ, పింఛన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి వెళ్లి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు కూడా అదే విధంగా మేనిఫెస్టో తో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్నాడు. అటు టీడీపీ సైతం సూపర్ సిక్స్ తో ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 నగదు ఇస్తారన్నారు. రైతుకు రూ.20వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదు తదితర పథకాలను సూపర్ సిక్స్ లో ప్రకటించారు. ఈ పథకాలను జనాల్లోకి గట్టిగా తీసుకెళ్తు నమ్మకం కలిగిస్తున్నారు. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారనేది చూడాలి.

Read Also : Ponguleti Srinivas Reddy : కష్టాల్లో పొంగులేటి..నమ్మొచ్చా..?