Site icon HashtagU Telugu

CM Jagan : నేడు దుర్గగుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం జ‌గ‌న్‌

Cm YS Jagan

Ap Cm Jagan

సీఎం జ‌గ‌న్‌మోహన్ రెడ్డి నేడు విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించనున్నారు. ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యంలో ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అనంతరం కనకదుర్గా దేవిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన సంద‌ర్భంగా ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ రామారావు, పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. రూ. 225 కోట్ల అంచనా వ్యయంతో దుర్గ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరమ్మతులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారంగా నాలుగు అంతస్తుల ఆటోమేటిక్ కార్ పార్కింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దుర్గ గుడి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత‌కుముందు రూ.70 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇందుకోసం దేవస్థానం నిధులు కూడా వినియోగించనున్నామ‌ని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి పనులు చేప‌డ‌తామ‌ని తెలిపారు. 18 నెలల్లో పనులు పూర్తవుతాయని ఆయ‌న తెలిపారు.

Exit mobile version