YS Jagan : సీఎం జగన్ నామినేషన్ కు ముహూర్తం ఖరారు

  • Written By:
  • Publish Date - April 12, 2024 / 05:33 PM IST

YS Jagan:సీఎం జగన్(CM Jagan) నామినేషన్(Nomination)వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆయన ఈ నెల 25న పులివెందుల(Pulivendula)లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం జగన్ ఏప్రిల్ 24న శ్రీకాకుళం(Srikakulam)
లో బస్సు యాత్ర౯bus yatra) ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగలో పాల్గొంటారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఇది ముందు జాగ్రత్త కోసమేనని తెలుస్తోంది. జగన్ గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో జగన్ గెలుపొందారు. అంతకుముందు, 2014లోనూ సతీశ్ కుమార్ పై జగన్ విజయం సాధించారు. ఈసారి పులివెందులలో సీఎం జగన్ కు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి బీటెక్ రవి పోటీలో ఉన్నారు.

Read Also: Kamala Das: ఒడిశా మాజీ మంత్రి కమలా దాస్ మృతి

మరోవైపు ఎన్నికల వేళ సిఎం జగన్‌ సమక్షంలో పలువురు నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ఆలూరు, కోడుమూరు నియోజక వర్గాల్లో టీడీపీ, బీజేపీ నుంచి వైసీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి జగన్ ఆహ్వానించారు.

ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పద్మజ టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి కూడా వైసీపీ గూటికి చేరుకున్నారు.

Read Also: Sisodia: మరోసారి ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సిసోడియా

బీజేపీ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్‌ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్‌. వీరి చేరికలతో స్థానికంగా వైసీపీ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు.