Site icon HashtagU Telugu

CM Jagan: జగన్ ఇంట సంబురం.. భారతి సమేత సంక్రాంతి..!

CM Jagan

Resizeimagesize (1280 X 720) (3) 11zon

ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ ఏటా జగన్ (CM Jagan) తన సతీమణితో కలిసి సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. భోగి మంటను వెలిగించిన సీఎంవైయ‌స్ జగన్‌.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శనను జగన్‌ దంపతులు తిలకించారు. రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి జీవితాల్లో మరింత ప్రగతితో కూడిన మార్పును తీసుకురావాలని, పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్ళలో, ప్రతి ఇంటా ఆనందాల సిరులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

క్యాంపు కార్యాల‌యంలో ప‌ల్లె వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించేలా సంక్రాంతి సంబ‌రాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. సంబరాల్లో భాగంగా సీఎం వైయ‌స్ జగన్‌ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు..పార్టీ నేతలతో కలిసి సీఎం జగన్ దంపతులు సంప్రదాయ బద్దంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

Also Read: Chandrababu: పొలిటికల్ పండగ.. ఇక చంద్రబాబు దూకుడు

ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహించారు. గోశాలలో సీఎం జగన్‌ దంపతులు గోపూజ చేశారు. సంక్రాంతి ఏర్పాట్లలో భాగంగా గ్రామ సచివాలయం, వైయ‌స్ఆర్‌ విలేజ్‌ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసారు. సింగర్‌ హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్‌తో పాటలు పాడి వీరు.. ఈ వేడుకలకు మరింత జోష్ పెంచారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన చైల్డ్‌ సింగర్‌ ప్రకృతి రెడ్డి. అనంతరం సీఎం జగన్‌ ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి జగన్‌ దంపతులతో సెల్ఫీ తీసుకున్నారు.