Site icon HashtagU Telugu

Andhra Pradesh : అన్నమయ్య జిల్లాలో టమాటా ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభించున్న సీఎం జ‌గ‌న్‌

Cm YS Jagan

Ap Cm Jagan

అన్నమ‌య్య జిల్లా బి కొత్తకోట మండలం తుమ్మనగుంట గ్రామంలో రూ.5.50 కోట్లతో ఏర్పాటు చేసిన టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్‌ని సీఎం జ‌గ‌న్ ఈ రోజు ప్రారంభించ‌నున్నారు. తుమ్మనగుంట గ్రామంలోని టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్‌ని ఆయ‌న ప‌రిశీలించారు. రైతులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ, గ్రీన్‌లీఫ్‌ కంపెనీతో జిల్లాలో యూనిట్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. శిక్షణ పొందిన రైతుల ద్వారా అన్ని రకాల కూరగాయలను ప్రాసెస్ చేసి, అనంతరం మార్కెట్‌కు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెసింగ్, గ్రేడింగ్, కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు నేరుగా మార్కెట్‌ సౌకర్యం కల్పించడంతోపాటు తమ ఉత్పత్తులకు మంచి ధర కల్పించడమే లక్ష్యమని ఆయన సూచించారు. మరో రెండు నెలల్లో జిల్లాలోని మొలకలచెరువు, రామసముద్రం గ్రామాల్లో మరో రెండు ప్రాసెసింగ్ కేంద్రాలు రానున్నాయి. మదనపల్లె ఆర్డీఓ మురళి, ఉద్యానవన అధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.