Site icon HashtagU Telugu

CM Jagan : నేడు విశాఖకు సీఎం జగన్‌..

Cm Jagan

Cm Jagan

శ్రీ రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) బుధవారం బందరు నగరంలోని చిన్నముషిడివాడలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించనున్నారు . ఈ పర్యటన సోమవారం జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల బుధవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రోడ్డు మార్గంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు సీఎం వైఎస్‌ జగన్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నానికి సీఎం జగన్‌ వెళ్లనున్నారు. అనంతరం చినముషిడివాడ చేరుకుంటారు. శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్‌. ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం తాడేపల్లి తిరిగి వస్తారు. పూజలు నిర్వహించి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. దాదాపు గంట పాటు శారదా పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైఎస్ జగన్ పాల్గొననున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. చినముషిడివాడలో గల విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం ఏర్పాటవుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా వీటిని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేటితో రాజశ్యామల యాగంతో శారదా పీఠం వార్షికోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలంటూ ఇదివరకే వైఎస్ జగన్‌కు ఆహ్వానపత్రం అందింది. ఇటీవలే శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స‌రస్వ‌తి స్వామి ఆయనను కలిశారు. శారదాపీఠం వార్షికోత్స‌వాల‌కు రావాల్సిందిగా ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేశారు. గత ఏడాది కూడా వైఎస్ జగన్ ఈ వేడుకల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. సీఎం జగన్ విశాఖ శ్రీశారదా పీఠాన్ని సందర్శించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఫోర్ట్ నుంచి పీఠం వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. సీఎం ను చూసేందుకు ప్రజలు భారీ రానుండటంతో బారీకేడ్లు ఏర్పాట్లు చేశారు పోలీసులు.

Read Also : Medaram Jatara : నేడు మేడారం జాతరలో కీలక ఘట్టం.. గద్దెలపైకి పగిడిద్దరాజు, గోవిందరాజు