Site icon HashtagU Telugu

CM Jagan : ఈ నెల 21 న “నేత‌న్న నేస్తం” .. వెంక‌ట‌గిరిలో ప్రారంభించ‌నున్న సీఎం జ‌గ‌న్‌

Cm YS Jagan

Ap Cm Jagan

నేతన్న నేస్తం కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21న తిరుపతి జిల్లా వెంకటగిరిలో పర్యటించనున్నారు. 2023-23కి సంబంధించిన నేత కార్మికుల‌కు బటన్‌ను నొక్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించ‌నున్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఐదో విడత సాయం ఇది. డిప్యూటీ సీఎం కె. నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ, ఎంపి డాక్టర్ ఎం. గురుమూర్తి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, లు వెంకటగిరిలోని బహిరంగ సభ ప్ర‌దేశాన్ని ప‌రిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులంతా కృషి చేయాలని సూచించారు. మునుపటి ప‌ర్య‌ట‌న సమయంలో గుర్తించిన ఏవైనా తప్పులు ఈసారి పునరావృతం కాకూడదని తెలిపారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ టికెట్‌పై భారీ మెజారిటీతో గెలిచినా.. ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి స‌స్పెండ్ త‌రువాత‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా రాంకుమార్‌రెడ్డిని నియమించామ‌ని..వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ హెలిప్యాడ్ వద్ద రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వేదిక ఏర్పాట్లు, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీరు, అల్పాహారం అందించడం, రవాణా, వైద్య శిబిరం, అంబులెన్స్, ఫోటో గ్యాలరీ, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు తదితర అంశాలను పూర్తిగా ఆయా అధికారులు చూసుకుంటారని తెలిపారు.