ఏపీ రాజకీయలంతా (AP Politics) ఢిల్లీ (Delhi )వేదికగా నడుస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో దేశం మొత్తం ఏపీ ఎన్నికలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఎవరు విజయం సాధిస్తారు..? రాష్ట్ర ప్రజలు ఏ పార్టీకి ఓటు చేస్తారు..? ఎవర్ని సీఎం గా చేస్తారో అని అంత మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో జనసేన – టీడీపీ ఒకటిగా బరిలోకి దిగుతున్నాయని నిన్నటి వరకు అనుకున్నారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా చేయి కలపబోతున్నట్లు అర్ధం అవుతుంది. నిన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ లో అనేక అంశాల గురించి చర్చించారు.
ఢిల్లీ పర్యటనలో ఎన్డీయేలో చేరాలని చంద్రబాబును అమిత్ షా, జేపీ నడ్డా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే పార్టీలో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అమిత్ షా నివాసం నుంచి నడ్డా వెళ్లిపోయిన తర్వాత కూడా.. షా, బాబుల సమావేశం కొనసాగింది. దేశ, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం. ఇదే విషయాన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఈరోజు వైసీపీ అధినేత , సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ రాత్రి జన్‌పథ్ నివాసంలో జగన్ బస చేయనున్నారు.. అపాయింట్‌మెంట్ షెడ్యూల్ ప్రకారం రేపు ప్రధాని మోడీ తో సమవేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాని తో ఎలాంటి చర్చలు జరపనున్నారో…ఎన్నికల విషయంలో ఏమైనా మాట్లాడనున్నారా..? టీడీపీ పొత్తు ఫై ఏమైనా మాట్లాడతారా..? అనేది ఆసక్తి రేపుతోంది.
మరోపక్క టీడీపీ బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీతో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలని బాబు ప్రయత్నం. ఐదేళ్లలో మేం చేసిన సంక్షేమం చెప్పి ఓట్లు అడుగుతున్నాం. సీఎం జగన్ చేసిన అభివృద్ధే.. మరోసారి గెలిపిస్తుంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేదు. చంద్రబాబు అద్దె మైకులా షర్మిల మాట్లాడుతున్నారని సజ్జల అన్నారు.
Read Also : Mood Of the Nation 2024 : ఏపీలో ‘టీడీపీ- జనసేన’ కూటమిదే విజయం