ఏపీ (AP) రాజకీయాలు మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్కల మారిపోయాయి. ఇప్పటివరకు జగన్ (Jagan) ఫై బయటి వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు..ఇప్పుడు సొంత చెల్లెలు (Sharmila) కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టడం తో..జగన్ సైతంమరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేసారు. చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన…ఈరోజు ఉరవకొండ (Uravakonda
) లో జరిగిన సభలో షర్మిల ఫై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ ఏపీ PCC చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన షర్మిల..వైసీపీ ప్రభుత్వం ఫై ఏ రేంజ్ లో విమర్శలు చేసిందో మరోసారి చెప్పాల్సిన పనిలేదు. కేవలం ప్రభుత్వం ఫైనే కాదు జగన్ ఫై కూడా విమర్శలు చేయడం తో వైసీపీ నేతలు షర్మిల ఫై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు జగన్ సైతం పరోక్షంగా చెల్లెలిపై విమర్శలు సంధించారు. మంగళవారం ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నిధుల జమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన సీఎం జగన్..ఏపీలో చంద్రబాబుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వారిలో బీజేపీలో కొంత మంది ఉన్నారని..పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు కూడా చంద్రబాబు స్టార్ క్యాంపెయినరేన్నారు.
రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని..పరోక్షంగా షర్మిల ఫై విమర్శలు చేసారు. ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారంటూ జగన్ ఎద్దేవా చేసారు. అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్ క్యాంపెయినర్‌లు ఉన్నారు. కొందరు టీవీల్లో విశ్లేషకులు, మేధావుల పేరిట టీవీల్లో కూడా కనిపిస్తారని సీఎం జగన్ విమర్శించారు.
Read Also : Ranga Reddy: హైదరాబాద్ కంటే రంగారెడ్డి ఫస్ట్, ఎందులో తెలుసా