CM Jagan Attack: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం.. దుర్గారావు విడుదల

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో దుర్గారావును అర్ధరాత్రి పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం.

CM Jagan Attack: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై రాళ్ల దాడి కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండవ నిందితుడు వేముల దుర్గారావును పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని అధికారులు తేల్చిచెప్పడంతో దుర్గారావును అర్ధరాత్రి పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. విడుదలైన తరువాత దుర్గారావు నేరుగా కుటుంబ సభ్యులను కలిశాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఆనందం వ్యక్తం చేశారు.

కాగా దుర్గారావును అనవసరంగా నిర్బంధించడంపై పోలీసులపై కుటుంబ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు, అతనికి నేరంతో సంబంధం ఉన్న ఖచ్చితమైన ఆధారాలు లేకుండా అతన్ని పట్టుకోవడంలో పోలీసుల చర్యలను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడిన అసలు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దృష్టి సారించాలని కుటుంబ సభ్యులు కోరారు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి పెరిగింది.

We’re now on WhatsAppClick to Join

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు పర్యటనలో భాగంగా విజయవాడలో జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళ దాడి చేశారు. ఈ క్రమంలో ఓ గులకరాయి సీఎం నుదుటున బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. అయితే ఇది కేవలం ఎన్నికల కుట్రలో భాగమేనని ఎన్డీయే కూటమి ఆరోపిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ దాడిని భూటకమని నిర్దారించారు. గత ఎన్నికల సమయంలో కోడికత్తితో స్వయంగా జగన్ ఎటాక్ చేయించుకున్నాడని, ఇప్పుడు గులకరాయితో ప్రయోజనం పొందాలని చూస్తున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Also Read: Dinesh Karthik: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియా జ‌ట్టులో దినేష్ కార్తీక్‌..?