Site icon HashtagU Telugu

AP Politics: టీడీపీకి జగన్ షాక్.. ఏపీలో ఆహా క్యాంటీన్లు!

Canteens

Canteens

ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలోని ప్రధాన పార్టీలు ప్రజా సంక్షేమ పథకాలతో ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కోసం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఉన్న అన్నా క్యాంటిన్లు తొలిగించారనే విమర్శలకు చెక్ పెడుతూ.. రాష్ట్రంలో ఆహా క్యాంటిన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంటిన్లను అందబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్యాంటిన్ల నిర్వహణ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు అప్పగిస్తున్నారు.

ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్‌ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ క్యాంటిన్లు ప్రారంభంకాగా.. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని చెబుతున్నారు. ఈ ఆహా క్యాంటిన్లను ఆస్పత్రులు, బస్టాండులు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, మున్సిపల్ ఆఫీసుల వద్ద ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. ఈ క్యాంటీన్లలో వంటకాలను ఇంటి దగ్గరే వండి.. వాటిని ఆయా ప్రాంతాలకు తీసుకొచ్చి కియోస్క్‌ల దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ క్యాంటీన్‌లలో డిమాండ్‌ను బట్టి టిఫిన్స్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఏర్పాటు చేస్తారు. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం మరిన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.

రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘అన్న క్యాంటీన్లు’ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో పలు చోట్లా ‘అన్న క్యాంటీన్‌’ను  ప్రారంభించారు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీపడకుండా పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేదలందరికి నాణ్యమైన ఆహారాన్ని కేవలం రూ.5కే అందించాయి. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్లపై నిర్లక్ష్యం వహిస్తుందని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆహా క్యాంటీన్లపై టీడీపీ నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Also Read: Prabhas & Ram Charan: రామ్ చరణ్ నా స్నేహితుడు, అతనిలో కలిసి కచ్చితంగా సినిమా చేస్తా : ప్రభాస్