Site icon HashtagU Telugu

CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్

CM Jagan

CM Jagan

CM Jagan: ఎర్రసైన్యం చిత్రంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండును సృష్టించారు ప్రముఖ దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి. కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా సామజిక బాధ్యత సినిమాలు తెరకెక్కిస్తుంటారు నారాయణ మూర్తి. మూస చిత్రాల పద్దతిని వదిలి ఆయన తీసిన సినిమాలు చాలానే విజయవంతమయ్యాయి. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దీవిటీలు, లాల్‌సలాం, దండోరా, ఎర్రసైన్యం, చీమలదండు, దళం, చీకటి సూర్యులు, ఊరు మనదిరా మరియు వేగుచుక్కలు తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆర్. నారాయణ మూర్తి గతంలో సీఎం జగన్ ని కలిశారు. ఈ భేటీలో సినిమా పరిశ్రమ గురించి మాత్రమే కాకుండా తన ఊరులో నీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనీ సీఎం జగన్ కి మొరపెట్టుకున్నారు. సీఎం జగన్ కూడా వెంటనే ఈ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ప్రాజెక్టు త్వరలోనే సాకారమవుతుందని అందరూ భావించారు. అయితే ఇన్నేళ్ల తర్వాత కూడా ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది.

We’re now on WhatsAppClick to Join

తూర్పుగోదావరి జిల్లా ఏలూరులోని కాల్వలను, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తాండవ కాలువలను అనుసంధానం చేయడం వల్ల కొత్త నీటిపారుదల ప్రాజెక్టు ఏర్పడి రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలో 5600 ఎకరాల భూమికి ప్రయోజనం చేకూరుతుంది. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 470 కోట్లు మరియు 2021మార్చి 19న నిర్మాణ అనుమతి మంజూరు చేసింది. టెండర్లను కూడా ఆహ్వానించారు. అయితే ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే ఈ ప్రాజెక్టు కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. ఆమోదం తెలిపి మూడేళ్లు గడిచినా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగలేదు.దీంతో ప్రాజెక్టు కోసం కళలు కన్న నారాయణమూర్తి సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నాడట.

Also Read: KCR: ప్రజలను కలుస్తూ, కష్టాలను తెలుసుకుంటూ.. పదమూడో రోజు కేసీఆర్ బస్సు యాత్ర విశేషాలు