Repalle Rape Case: రేపల్లె ‘రేప్’పై సీఎం సీరియస్

రేపల్లె అత్యాచార సంఘటన ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

  • Written By:
  • Updated On - May 1, 2022 / 08:54 PM IST

రేపల్లె అత్యాచార సంఘటన ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దీంతో నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. మహిళపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడటం, అడ్డు వచ్చిన భర్తను కొట్టి ముగ్గురు సామూహిక అత్యాచారం చేయటం తెలిసిందే. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం అధికార వైసీపీకి తలనొప్పిగా మారింది. విపక్షాలు మరింతగా ఘాటుగా రియాక్టు అవుతున్నాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరన్న నమ్మకంతోనే నేరస్తులు చెలరేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ దారుణ ఉదంతానికి పాల్పడిన నలుగురురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన నిందితులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్టు అయ్యారు. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో ఫోన్ లో మాట్లాడారు. సామూహిక అత్యాచారఘటన కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది

బాపట్ల జిల్లా ఎస్పీ స్వయంగా రేపల్లో రైల్వే స్టేషన్ కు వెళ్లి నేరానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితుల్ని పోలీసులు విచారిస్తున్నారు. అవనిగడ్డలో పనుల కోసం భార్యభర్తలు ఇద్దరు రేపల్లె స్టేషన్ లో అర్థరాత్రి వేళ దిగినట్లుగా చెబుతున్నారు. ఆ క్రమంలో భర్తని కొట్టి మహిళపై రేప్ చేశారని ప్రాధమికంగా తెలిసింది.

రాత్రి బాగా ఆలస్యం కావటంతో రైల్వేస్టేషన్ బెంచ్ మీదనే పడుకున్నారని, ఆమె మీద కన్ను వేసిన కామాంధులు భర్తను గాయపరిచి ఆమెపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. నిందితుల చేతిలో గాయపడ్డ భర్తను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు బాధితురాలిని సైతం ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తారు. తాజా ఉదంతం ఏపీ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో అనూహ్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.