Tollywood: జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖులు భేటీ.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్న”ఆ ఇద్ద‌రు”..!

  • Written By:
  • Updated On - February 10, 2022 / 02:31 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఎట్ట‌కేల‌కు భేటీ అయ్యారు. ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం పై చర్చించేందుకు, సీఎం జ‌గ‌న్‌తో, తాజాగా చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్ద‌లు భేటీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, స్టార్ హీరోలు ప్ర‌భాస్, మహేష్‌బాబు, అలాగే ర‌చ‌యిత, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, హాస్య‌న‌టుడు అలీ, వ‌న్ అండ్ ఓన్లీ నారాయణ మూర్తి త‌దిత‌రులు భేటీ అయ్యారు.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే జ‌గ‌న్‌తో భేటీకి వ‌చ్చిన సినీ ప్ర‌ముఖుల్లో పోసాని, ఆలీ ఈ సమావేశానికి హాజరవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. పోసాని కృష్ణమురళి తొలి నుంచి వైసీీపీకి అండగా ఉంటూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ పై ఎవ‌రైనా విమ‌ర్శ‌లు చేస్తే చాలు, పోసాని వెంట‌నే మీడియా ముందుక వ‌చ్చి, వారిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు. అయితే కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై పోసాని వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డంతో, పీకే ఫ్యాన్స్‌కు పోసాని టార్గెట్ అయ్యారు. ఇక అప్ప‌టి నుంచి సైలెంట్‌గా ఉన్న పోసాని తాజాగా జ‌గ‌న్‌తో సినీ పెద్ద‌లు భేటీలో భాగంగా చ‌ర్చ‌ల్లో పాల్గొన‌డం ఆశ‌క్తిగా మారింది.

మ‌రోవైపు హాస్య‌న‌టుడు అలీ కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. టాలీవుడ్‌లో దాదాపు అంద‌రి హీరోల‌తో అలీకి మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. ఇక గ‌తంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్, అలీలు జాన్ జిగిరీలు. అయితే ఏపీలో జ‌రిగిన 2019 ఎన్నిక‌లు కార‌ణంగా ప‌వ‌న్-అలీల దోస్తీ బ్రేక్ అయ్యింది. ఆ ఎన్నిక‌ల్లో భాగంగా అలీ వైసీపీలో చేర‌డంతో, హ‌ర్ట్ అయిన ప‌వ‌న్, అలీ పై కామెంట్స్ చేయ‌డం, ఆ త‌ర్వాత అలీ కూడా త‌గ్గ‌కుండా ప‌వ‌న్‌కు కౌంట‌ర్ ఇవ్వ‌డం అప్ప‌ట్లో సినీ వ‌ర్గాల్లో సెన్షేష‌న్‌గా మారింది. అయితే ఇప్పుడు జ‌గ‌న్‌తో భేటీ అయిన సినీ ప్ర‌ముఖుల‌తో పాటు అలీ రావ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ మొద‌లైంది.

ఈ క్ర‌మంలో టాలీవుడ్‌లో తనకు మద్దతిస్తున్న వారిని, జ‌గ‌న్ ప్రత్యేకంగా పిలిపించుకున్నార‌ని, ఈ క్ర‌మంలోనే పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీకి ఏపీ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక ఆహ్వానం అందింద‌ని టాలీవుడ్‌లో ఓ వ‌ర్గం భావిస్తుంది. అంతే కాకుండా సినిమా టిక్కెట్ రేట్ల వివాదానికి సంబంధించిన‌ చర్చలలో పోసాని, అలీల భాగస్వామ్యం పెద్దగా లేకపోయినా, వారు హాజ‌రు కావ‌డం సినీ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఏది ఏమైనా కరోనా థర్డ్‌వేవ్ తగ్గుముఖం పడుతున్న నేప‌ధ్‌యంలో, బ‌డా హీరోల, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఈరోజు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల‌ భేటీ పై సినీ జ‌నాల్లో ఆశ‌క్తి నెల‌కొంది. మ‌రి ఏపీలో సినిమా టికెట్ రేట్స్ వివాదానికి ఎండ్ కార్డ్ ప‌డుతుందో లేదో చూడాలి.