Jagan: అలా చేస్తే గుండెపోటు ఖాయం..ప్రతిపక్షాలపై జగన్ సటైర్లు..!!

పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు అండ్ ఎల్లో మీడియాదేనని తనదైన శైలిలో విమర్శించారు ఏపీ సీఎం జగన్.

  • Written By:
  • Publish Date - April 9, 2022 / 10:35 AM IST

పిల్లలకు ఇచ్చే చిక్కీపై ముఖ్యమంత్రి బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబు అండ్ ఎల్లో మీడియాదేనని తనదైన శైలిలో విమర్శించారు ఏపీ సీఎం జగన్. నంద్యాల జగనన్న వసతి దీవేన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదేనని మరోసారి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు.

పచ్చపార్టీ కడుపు మంట, అసూయకు మందేలేదని..చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లబోసుకుంటున్నారంటూ జాలీపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువగా ఉన్న జీఈఆర్ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను పెంచిన ఘతన తమ ప్రభుత్వానిదేనన్నారు. దీన్నంతటిని ప్రజలు గమనించాలని కోరారు.

2021-22 విద్యాసంవత్సరానికి గాను రెండవ విడత జగనన్న వసతి దీవెన కింద దాదాపు 11లక్షల మంది విద్యార్థుల తల్లులకు 1,024 కోట్ల రూపాయల చెక్కులను లాంఛనంగా అందించారు. పిల్లలకు అందించే చిక్కి గురించి చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మా ప్రభుత్వం 1900కోట్లు ఖర్చు పెడుతుంటే…చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 500కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎల్లో పార్టీకి అసూయకు మందులేదని…ఈ అసూయ పెరిగితే బీపీ వచ్చి ఏదో ఒకరోజు గుండెపోటుతో టికెట్ తీసుకుంటారని ఎద్దేవా చేశారు.

మీడియాలోని ఒక వర్గం దురుద్దేశ్యపూర్వకంగా ప్రవర్తిస్తుందని…తాము చేస్తున్న అభివ్రద్ధిని చూడలేకపోతుందన్నారు. ప్రభుత్వం పరువు తీసేందుకే ఉద్దేశ్యపూర్వకంగా తమపై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దొంగల ముఠాగా అభివర్ణించారు సీఎం జగన్ .

నాడు నేడుతో బడుల రూపురేఖలను మారుస్తూ…ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు తీసుకొచ్చామని జగన్ తెలిపారు. చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు ఎల్లో మీడియాకు పట్టట్లేదన్నారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదే అన్నారు.