Site icon HashtagU Telugu

AP Flood Relief: ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించండి… ఎమ్మెల్యేల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశం

విజయవాడ: ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. వరదల వల్ల నష్టపోయిన జిల్లాల ఇంచార్జి మంత్రులు, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జిల్లాల్లోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఎర్రబెల్లం, 1 కిలోల పప్పు, పామాయిల్, ఉల్లిపాయలు మరియు బంగాళదుంపలను అందజేస్తుంది.

Also Read : ఏం కొనేట‌ట్టు లేదు..ఏం తినేట‌ట్టు లేదు

గ్రామాల్లో పర్యటించి ప్రజలకు తక్షణ సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి తమ పార్టీ నేతలను కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని, అంతా సవ్యంగా జరిగే వరకు వరద బాధితులకు అండగా నిలవాలన్నారు. ముంపు ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా, పట్టణాల్లో పారిశుధ్యం, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులతో సమన్వయం చేసుకోవాలని… బాధితులకు రేషన్ పంపిణీ చేయాలని పార్టీ నాయ‌కుల‌కు సీఎం జ‌గ‌న్ తెలిపారు. పంట న‌ష్టాన్ని అంచానా వేయాల‌ని అధికారుల‌కు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం లేద‌ని…సహాయక చర్యలను పర్యవేక్షించడం కొనసాగించాల‌ని జ‌గ‌న్ తెలిపారు.

Also Read: ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి!

వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రధాన కార్యదర్శి ఉషారాణి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరద ప్రభావిత కుటుంబాలకు, ప్రధానంగా వరదనీటిలో మునిగిన/ఇళ్లు మునిగిపోయిన వారికి ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతిని ఇచ్చింది. SPSR నెల్లూరు, చిత్తూరు, అనంతపురం మరియు వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్లు బాధిత కుటుంబాలకు ఉచిత పంపిణీ గురించి తగిన ప్రచారంతో ఈ జిల్లాల్లోని అన్ని బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరారు.

Exit mobile version