Site icon HashtagU Telugu

CM Jagan : పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

Cm Jagan

Cm Jagan

రాష్ట్రంలో కొత్తగానిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివ‌రించారు. రామాయపట్నం పోర్టు పనుల ప్రగతిని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను కూడా సీఎం జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్‌ నిర్మాణ పనుల పురోగ‌తి నివేదిక‌ను సీఎం జ‌గ‌న్‌కు అధికారులు అందించారు. రాష్ట్రంలో 10 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులపై కూడా సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలపై సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. జువ్వలదిన్నెలో 86 శాతం పనులు పూర్తి, నిజాంపట్నంలో 62 శాతం, మచిలీపట్నంలో 56.22 శాతం, ఉప్పాడలో 55.46శాతం పనులు పూర్తి అయిన‌ట్లు అధికారులు సీఎం జ‌గ‌న్‌కు తెలిపారు. జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్‌ మరో 40 రోజుల్లో సిద్ధం అవుతుంద‌ని.. మొదటి దశలో అన్ని ఫిషింగ్‌ హార్బర్లు డిసెంబర్‌కల్లా పూర్తవుతాయన్న సీఎం జ‌గ‌న్‌కు అధికారులు వెల్ల‌డించారు.