CM Jagan: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడలపై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం, మరియు అంబటి రాయుడు సీఎం జగన్

Published By: HashtagU Telugu Desk
Cm Jagan

Cm Jagan

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడలపై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం, మరియు అంబటి రాయుడు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో క్రికెట్ అకాడమీ అంశంపై చర్చించారు. దానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఇదిలా ఉండగా ఏపీలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా సంబరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని యోచిస్తుంది. ఈ మేరకు సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాలపై సమీక్ష చేపట్టారు.

క్రీడా రంగంలో నైపుణ్యాలపై సీఎం చర్చించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారుల్ని గుర్తించి వారికీ సరైన మార్గాన్ని చూపించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఇక ఆడుదాం ఆంధ్ర క్రీడలకు హాజరయ్యే క్రీడాకారుల కోసం వసతుల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.

ఇదే కార్యక్రమంలో సీఎం జగన్ ఏపీలో ఐపీఎల్ అంశాన్ని లేవనెత్తినట్టు తెలుస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఏపీలో క్రికెట్ అభివృద్ధి కోసం పని చేసేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ మేరకు ఏపీలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో తిరుపతి, కడప, విశాఖ, మంగళగిరిలో క్రికెట్ అకాడమీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read More: 4 Tasks in June: జూన్ 30 లోపు ఈ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే.. లేకపోతే అంతే సంగతులు?

  Last Updated: 22 Jun 2023, 07:00 PM IST