AP : మత్స్యకారులకు సీఎం జగన్ నిధులు విడుదల

పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000 చొప్పున మొత్తంగా రూ.161.86 కోట్లను సీఎం బటన్‌నొక్కి

Published By: HashtagU Telugu Desk
Jagan Released Funds To Fis

Jagan Released Funds To Fis

అంబేడ్కర్ కోనసీమ (Konaseema), కాకినాడ (Kakinada) జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైన్‌ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు (CM Jagan Released Funds To Fishermen) సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో జగన్ (CM Jagan) బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.

ప్రపంచ మత్స్యకార దినోత్సవం (World Fisheries Day) సందర్భంగా సూళ్లూరుపేటలో కార్యక్రమం జరుపుకోవాలని అనుకున్నాం. వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకొనే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. మనం ఇవ్వాలనుకున్న, చేయాలనుకున్న ఆర్థిక సాయం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైపు లైన్‌ ద్వారా నష్టపోతున్న మత్స్యకారులందరికీ సాయం చేసేందుకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు జగన్ చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000 చొప్పున మొత్తంగా రూ.161.86 కోట్లను సీఎం బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమ చేసారు. ఓఎన్జీసీ పైపులైన్ నిర్మాణం వల్ల, జరుగుతున్న తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో, అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లాల్లో 16,408 మంది మత్స్యకారుల కుటుంబాలకు, కాకినాడ జిల్లాలో మరో 7,050 మంది, మొత్తంగా 23,458 మంది మత్స్యకారుల కుటుంబాలకు కలిగిన నష్టాన్ని భర్తీ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. మత్స్యకారులకు పరిహారం విషయంలో ఓఎన్జీసీతో మాట్లాడి 3 దశలో రూ.323 కోట్ల పరిహారం ఇప్పటికే ఇప్పించినట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు రూ.161 కోట్ల నాలుగో విడత నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ.485 కోట్ల పరిహారం అందించినట్లు వివరించారు.

Read Also : BRS Public Meeting At Madhira : కాంగ్రెస్ పార్టీ కి 20 సీట్లు కూడా కష్టమే – కేసీఆర్

  Last Updated: 21 Nov 2023, 04:19 PM IST