Site icon HashtagU Telugu

CM Jagan : గీతాంజలి మరణంపై స్పందించిన సీఎం జగన్‌

CM Jagan reacts on Geetanjali death

CM Jagan reacts on Geetanjali death

CM Jagan: సీఎం జగన్‌ ఈరోజు విశాఖ(Visakha) ఆనందపురంలో వైసిపి సోషల్‌ మీడియా వారియర్స్‌(Social media warriors)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గీతాంజలి మరణం(Geetanjali Death)పై స్పందించారు. నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్ చేసి వేధించారని వ్యవస్థ ఎంత దిగజారిందో చెప్పడానికి గీతాంజలి ఆత్మహత్య నిదర్శనమని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైయస్ జగన్ ఎన్ని కుట్రలు తట్టుకునే జగన్ నిలబడుతున్నారంటే సోషల్ మీడియా బలమేనని జగన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. మన మీద దాడి చేస్తున్నారంటే విజయానికి మనం చేరువులో ఉన్నామని అర్థమని, వాళ్ళు విజయానికి దూరంగా ఉన్నారు కనుక దాడి చేస్తున్నారని జగన్‌ అన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఎవరైనా వేధింపులకు గురైతే పార్టీకి అండగా ఉంటుందని వారికి ఆయన హామీ ఇచ్చారు.

Read Also: Pushpa 2 : పుష్ప 2.. మరోటి రెడీ చేస్తున్నారట..!

మరోవైపు సీఎం జగన్‌ చేపట్టిన బస్సు యాత్ర 21వ రోజైన మంగళవారం విజయనగరం జిల్లాలో కొనసాగనుంది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం అనే పేరుతో జగన్‌ ఎన్నికల ప్రచారం కోనసాగిస్తున్నారు.

Read Also: Prabhas Kalki 2898 AD : కల్కి కోసం అమితాబ్ కి ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంత..?