CM Jagan : పులివెందులలో రేపు సీఎం జగన్‌ నామినేషన్‌..

CM Jagan: తన సొంత నియోజకవర్గం పులివెందుల(Pulivendula)లో రేపు ఏపి సీఎం జగన్‌ తన నామినేషన్‌ (Nomination) ను దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మందు సీఎం జగన్‌ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు. అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన పర్యటన తాలూకు షెడ్యూల్ ను సీఎంవో అధికారులు పంపించారు. We’re now on WhatsApp. Click to Join. […]

Published By: HashtagU Telugu Desk
Cm Jagan

CM Jagan nomination tomorrow in Pulivendului..

CM Jagan: తన సొంత నియోజకవర్గం పులివెందుల(Pulivendula)లో రేపు ఏపి సీఎం జగన్‌ తన నామినేషన్‌ (Nomination) ను దాఖలు చేయనున్నారు. నామినేషన్‌కు మందు సీఎం జగన్‌ పులివెందులలో ఏర్పాటు చేసిన సభకు హాజరుకానున్నారు. అనంతరం పులివెందుల వైఎస్సార్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన పర్యటన తాలూకు షెడ్యూల్ ను సీఎంవో అధికారులు పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం జగన్‌ షెడ్యూల్‌..

ఉదయం 7.45 గంటలకు రోడ్డు మార్గంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు పయనం
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 8.15 గంటలకు కడపకు టేకాఫ్
ఉదయం 9.05 గంటలకు కడప విమానాశ్రయానికి చేరిక
ఉదయం 9.10 గంటలకు కడప ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో పులివెందుల నియోజకవర్గం భాకరాపురం పయనం
ఉదయం 9.40 గంటలకు భాకరాపురం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరిక
ఉదయం 9.50 గంటలకు పులివెందుల సీఎస్ఐ మైదానంలో బహిరంగ సభకు హాజరు
ఉదయం 10 గంటల నుంచి 11.15 గంటల వరకు సభ
ఉదయం 11.15 గంటలకు నామినేషన్ వేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పయనం
ఉదయం 11.25 గంటల నుంచి 11.40 గంటల మధ్య నామినేషన్ దాఖలు
నామినేషన్ దాఖలు అనంతరం ఉదయం 11.45 గంటలకు భాకరాపురంలోని నివాసానికి చేరిక
11.45 నుంచి 12.15 గంటల వరకు విరామం
మధ్యాహ్నం 12.25 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరిక
మధ్యాహ్నం 12.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు హెలికాప్టర్ లో పయనం
మధ్యాహ్నం 1.00 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరిక
మధ్యాహ్నం 1.10 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరం తిరుగు పయనం
మధ్యాహ్నం 2.00 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు చేరిక
మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరిక

Read Also:Harish Rao: ఎమ్మెల్యే పదవికి హరీష్ రావు రాజీనామా..? మళ్లీ పోటీ చేయనంటూ శపధం

  Last Updated: 24 Apr 2024, 03:48 PM IST