AP Electric Bus : ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…!!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి...తిరుమల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Jagan (5)

Jagan (5)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి…తిరుమల పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి తాతయ్యగుంట ప్రాంతంలోని గంగమ్మ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షెడ్యూల్లో భాగంగా అలిపిరి చేరుకుని ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ విడతలో మొత్తం పది ఎలక్ట్రిక్ బస్సులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా కూడా పాల్గొన్నారు.

కార్యక్రమం అనంతరం తిరుమల కొండపైకి చేరుకోని…బేడీ ఆంజనేయస్వామిని దర్శనం చేసుకోనున్నారు. తర్వాత తిరుమల శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపును పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా రేణిగుంట ఎయిర్ పోర్టులో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు నేతలు ఘనస్వాగతం పలికారు.

  Last Updated: 28 Sep 2022, 01:34 PM IST