CM Jagan: నేడు న‌ర్సాపురంలో సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌.. ఆక్వా యూనివ‌ర్సిటీకి శంకుస్థాప‌న‌

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నేడు ప‌ర్య‌టించ‌నున్నారు. న‌ర‌సాపురం సమీపంలో ఏర్పాటు

  • Written By:
  • Updated On - November 21, 2022 / 12:02 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నేడు ప‌ర్య‌టించ‌నున్నారు. న‌ర‌సాపురం సమీపంలో ఏర్పాటు చేయనున్న ఆక్వా యూనివర్సిటీ, రీసెర్చ్ సెంట‌ర్‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా సాగుకు ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని సారిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నరసాపురంలో రూ.222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయం, పరిశోధనా కేంద్రం నిర్మాణం జ‌ర‌గ‌నుంది. దేశంలో తమిళనాడు, కేరళ తర్వాత ఆక్వా యూనివర్సిటీని పొందిన మూడో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 975 కి.మీ తీరప్రాంతాన్ని కలిగి ఉంది. ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ ఉంది. రొయ్యలు, చేపల పెంపకం వేలాది మంది మత్స్యకారులు, ఆక్వా రైతులకు జీవనోపాధికి ముఖ్యమైన వనరులలో ఒకటి. ఆక్వాకల్చర్‌లో అర్హత కలిగిన నిపుణుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమగోదావరిలో ఆక్వా విశ్వవిద్యాలయం మరియు పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది.

రాష్ట్రానికి ఆక్వాకల్చర్‌లో 20,000 మందికి పైగా నిపుణులు అవసరం. ఫిషరీస్‌లో పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్న 11,901 మంది అభ్యర్థులు, బీఎఫ్‌ఎస్‌సీ కోర్సులో 6,118 మంది అభ్యర్థులు, ఎంఎఫ్‌ఎస్‌సీ కోర్సు ఉన్న 2,541 మంది అభ్యర్థులు రాష్ట్రంలో అవసరమని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని, త్వరలో యూనివర్సిటీ నిర్మాణంతో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో 350 ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా యూనివర్సిటీ, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. మొదట్లో యూనివర్సిటీని నిర్మించి ఆ తర్వాత పరిశోధనా కేంద్రాన్ని నిర్మిస్తారు. మ‌రోవైపు రాష్ట్రంలో చేపలను పట్టుకుని సముద్రంలో నిల్వ చేసేందుకు ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్‌లను నిర్మిస్తోంది. ముఖ్యమంత్రి ఈ రోజు (సోమవారం) తన పర్యటనలో బియ్యపుతిప్ప సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 150 ఎకరాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మించి స్థానిక మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. హార్బర్ నిర్మాణంతో మత్స్యకారులు 653 బోట్లతో 17,000 టన్నుల చేపలు, 3,000 టన్నుల రొయ్యలను పట్టుకోవచ్చు. హార్బర్‌ నిర్మాణంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో నివసిస్తున్న సుమారు 6 వేల మంది మత్స్యకారులు లబ్ధి పొందుతారని, స్థానిక మత్స్యకారులకు పెద్దపీట వేస్తామ‌ని అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు తెలిపారు.