ఏపీ సీఎం జగన్ (CM Jagan) పలాసలోని వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project)) ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపింది. అలాగే పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Centre), సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ని ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుంది. ఆ ఆస్పత్రిలో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మూడు బ్లాకులుగా నాలుగు అంతస్తుల్లో ఆస్పత్రి నిర్మాణించారు. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్‌తో ప్రత్యేక వార్డులు ఉన్నాయి. అంతేకాదు… సీటీ స్కాన్, 2డీ ఎకో, హై ఎండ్ కలర్ డాప్లర్, మొబైల్ ఎక్స్‌రే, థూలియం లేజర్ యూరో డైనమిక్ మెషీన్ వంటి పరికరాలతోపాటు ఐసీయూ సౌకర్యాలు కూడా ఉన్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే 42 స్పెషాలిటీ డాక్టర్ పోస్టులు, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, 60 ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేయనున్నారు.
Read Also : Mallareddy : భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి రియాక్షన్..