Jagan : అసెంబ్లీ లో జగన్ లాస్ట్ స్పీచ్..అభివృద్ధి..నష్టాలపై ఎమోషనల్

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 05:46 PM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో (AP Assembly Sessions 2024) సీఎం జగన్ (CM Jagan) ఎమోషనల్ గా మాట్లాడారు. తమ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి..గత ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాలు, కేంద్ర విభజన , హైదరాబాద్ ను కోల్పోవడం తో ఏపీకి జరిగిన నష్టం తదితర అంశాల గురించి ప్రస్తావించారు. అలాగే కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని సైతం చెప్పుకొచ్చారు.

హైదరాబాద్ ను కోల్పోవడంతో ఈ పదేళ్లలో ఏపీ రూ.1.30 లక్షల కోట్లు నష్టపోయినట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఆ మొత్తం ఉంటే ఎంతో వెసులుబాటు ఉండేదన్నారు. ‘రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. కనీసం ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉంటే కోర్టుకు వెళ్లి సాధించుకునే వీలుండేది. మన మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే వరకు హోదా ఎండమావిగా కనిపిస్తోంది. కేంద్రంలో మెజార్టీ రావొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలని, లేదంటే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవని జగన్ తెలిపారు. ‘ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ను కోల్పోయాం. దీంతో ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోతున్నాం. ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. ప్రతి రాష్ట్రానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి. అందుకే నేను పదేపదే విశాఖ గురించి ప్రస్తావిస్తున్నా’ అని పేర్కొన్నారు. అలాగే కేంద్రం సైతం కొన్నేళ్లుగా రావాల్సిన నిధులు తగ్గాయని చెప్పుకొచ్చారు. ‘2015-20 మధ్య కేంద్ర పన్నుల్లో వాటాగా APకి 42% నిధులు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సూచించగా, కేంద్రం 35% ఇచ్చింది.

2020-25 మధ్య 41% నిధులు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచించగా, కేంద్రం 31.15% నిధులే ఇచ్చింది. దీంతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ మంచి పాలన అందించాం’ తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని , కరోనా కారణంగా ఆదాయం బాగా తగ్గింది, ఖర్చులు పెరిగాయి. తద్వారా అప్పులు కూడా పెరిగాయి. రెండు ఆర్థిక సంవత్సరాలు సవాళ్లు ఎదుర్కొన్నాం. మూడేళ్లలో రాష్ట్రం రూ.66,116 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది’. కరోనా వల్ల దేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని జగన్ గుర్తు చేసారు.

ఇక గత ప్రభుత్వ విధానాల కారణంగా విద్య, వ్యవసాయ రంగాలు, మహిళా సాధికారత వంటివి కుదేలయ్యాయని టిడిపి ఫై మండిపడ్డారు. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఐదేళ్లలో రూ.15వేల కోట్లు కూడా ఇవ్వలేదు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను దగా చేశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read Also : Chandrababu: రేపు ఢిల్లీకి చంద్రబాబు, పొత్తులపై బీజేపీ నేతలతో భేటీ