Site icon HashtagU Telugu

Cm Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన

Jagan

Jagan

Cm Jagan: ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ విజయవాడ ఇంద్రకీలాద్రిపై పర్యటించారు. జగన్ రాక సందర్భంగా ఆలయ పూజరులు ఘన స్వాగతం పలికారు. జగన్ దుర్గమ్మను సందర్శించుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనంకు ముందు దుర్గగుడి వద్ద పలు అభివృద్ధి పనులకు జగన్  శంకుస్థాపనలు చేశారు. నిర్మాణ పనుల శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించారు. దాదాపు 216 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నిర్మాణం పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. జగన్ వెంట ఆలయ అధికారులు ఉన్నారు.

216 కోట్లతో అభివృద్ధి పనులు

ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ. 57 కోట్ల రాష్ట్ర నిధుల్లో రూ. 30 కోట్లతో అన్నప్రసాద భవన నిర్మాణం, రూ. 27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ. 13 కోట్లతో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇక రూ. 15 కోట్లతో రాజగోపారం ముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం, రూ. 23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్‌, రూ. 7. 75 కోట్లతో కనకదుర్గానగర్‌ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, రూ. 18.30 కోట్లతో మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్‌ మార్పు, రూ. 19 కోట్లతో నూతన కేశఖండన శాల నిర్మాణం చేయనున్నారు.