ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ కి చెందిన నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం ..షర్మిల వెంట నడుస్తుండడం చేస్తున్నారు. ఇదే బాటలో మరింతమంది వైసీపీ నేతలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అలాగే షర్మిల సైతం ఏపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టడం ఆలస్యం అన్న అని కూడా చూడకుండా జగన్ ఫై విమర్శలు సంధించడం మొదలుపెట్టింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో వైసీపీ నేతలు సైతం షర్మిల కు కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు. ఇక జగన్ సైతం నిన్న ఉరవకొండ సభలో చంద్రబాబు కు షర్మిల కాంపెయిన్ గా మారిందంటూ పరోక్షంగా విమర్శలు చేసారు. ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీ కి దేవుడే బుద్ది చెపుతాడంటూ వ్యాఖ్యానించారు. బుధువారం తిరుపతిలో ఇండియా టుడే సమ్మిట్లో పాల్గొన్న జగన్..APCC చీఫ్ గా షర్మిలను నియమించడంపై స్పందించారు. ‘రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించింది. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తోంది. నేను కాంగ్రెస్కు రాజీనామా చేశాక మా చిన్నాన్నను మాకు వ్యతిరేకంగా పనిచేయించింది. విభజించి పాలించడం వాళ్ల నైజం. వీరికి దేవుడే గుణపాఠం చెబుతారు’ అని జగన్ ఫైర్ అయ్యారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ తామే గెలుస్తామని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ‘ఇచ్చిన హామీలను 98% అమలు చేశాం. ఏపీలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు చోటు లేదు. మా పోటీ టీడీపీ, జనసేనతోనే ఉంటుంది. సర్వేల ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నాం. వ్యతిరేకత ఉండటంతో కొందరికి టికెట్లు ఇవ్వడం లేదు. ప్రజలు మావైపే ఉన్నారు’ అని స్పష్టం చేసారు. మరి ప్రజలు జగన్ చెప్పినట్లు చేస్తారో..మార్పు కోరుతారో చూడాలి.
Read Also : Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!