Jharkhand capital formula: అమరావతే రాజధాని కానీ..!

ఝార్ఖండ్ తరహా రాజదానుల ఫార్ములా ను జగన్ అనుసరించ బోతున్నాడు. కోర్ట్ లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తాను అనుకున్నది చేయాలని ఏపీ సిఎం నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - February 16, 2022 / 03:05 PM IST

ఝార్ఖండ్ తరహా రాజదానుల ఫార్ములా ను జగన్ అనుసరించ బోతున్నాడు. కోర్ట్ లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తాను అనుకున్నది చేయాలని ఏపీ సిఎం నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త జిల్లాల్లో ఉగాది నుంచి పాలన ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇటీవల కలిసిన టాలీవుడ్ పెద్దలకు కూడా ఆ విషయం చెప్పాడు. ఇదే సమయంలో మూడు రాజధానుల విషయంలోనూ ముందుకే వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని పైన న్యాయ నిపుణుల సలహాలు..అనేక తర్జన భర్జన తరువాత ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా వినికిడి. మూడు రాజధానుల బదులు ఒక రాజధాని..రెండు ఉప రాజధానుల కాన్సెప్ట్ ను తెర మీదకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఇదే కాన్సెప్ట్ ను జార్ఖండ్ లోనూ అమల్లోకి తెస్తున్నారని చెబుతున్నారు. సాంకేతిక అంశాలపై నిపుణుల అభిప్రాయాలు
తీసుకొని బిల్లులో ఉప రాజధానులుగా మాత్రమే ప్రస్తావించాలని భావిస్తున్నట్లు సమాచారం.సినీ పరిశ్రమకు చెందిన వారితో జరిగిన సమావేశంలో సైతం త్వరలో అందరం విశాఖ వెళ్లాల్సిందేనంటూ జగన్ వ్యాఖ్యానించారు. విశాఖలో స్టూడియో ల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తామని ప్రతిపాదించారు. మంత్రులు బొత్సా..కొడాలి నాని తదితరులు ప్రతిపక్షాలు అడ్డుపడినా మూడు రాజధానుల నిర్ణయం ఆగదని చెప్పిన విషయం విదితమే.ప్రజామోదంతో మూడు రాజధానులు ఏర్పాటవుతాయని స్పష్టం చేసారు. సీఆర్డీఏ విషయంలో ఏ విధంగా జగన్ ముందుకు వెళ్తారనేది ఆసక్తి కరంగా మారింది. సీఆర్డీఏ పేరుతోనే అమరావతి రైతులకు ఒప్పందాలు చేసి ఉండటంతో… సీఆర్డీఏ ను మళ్లీ పునరుద్ధరణ జరుగుతుందని టాక్.

రాజధాని ప్రధానంగా అమరావతిగానే ఉండే పరిస్థితులు ఉండటంతో న్యాయ పరంగానూ సమస్యలు రావని అంచనా వేస్తున్నారు. కానీ, ఉప రాజధానులు అనే అంశం న్యాయ పరంగా కొనసాగుతుందా అనేది మరో సందేహం వ్యక్తం అవుతోంది. అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉప రాజధానులు ఫార్ములపై వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాచరణ ఏంటనేది అసెంబ్లీలో బిల్లు ప్రతిపాదించిన తరువాత మాత్రమే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగుతుందని..ఎవరూ మార్చలేరంటూ ధీమాగా చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ తాజా వ్యూహంపై కోర్టు సైతం చూస్తోంది. మూడు రాజధానుల అంశం ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠకు కారణమవుతోంది.
మూడు రాజధానులు బిల్లు ఉపసంహరించు కోవటంతో కేసులు అన్ని కొట్టి వేయాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ , సమగ్ర బిల్లు పెడతామంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా తీర్పు పెండింగులో ఉంది. ఆ తీర్పు రాకుండానే ఝార్ఖండ్ తరహా ఫార్ములా ను తీసుకొస్తూ బిల్లు పెడితే మళ్లీ కోర్ట్ లు ఎలా రియాక్ట్ అవుతాయో జగన్ కు అంతు పట్టడం లేదు. సో..అమరాతే ఏకైక రాజధాని..కానీ రెండు ఉప రాజధానులు రూపంలో జగన్ నయా ప్లాన్ చేసాడట.