CM Jagan Live: విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నం రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ సంస్థ నూతనంగా నిర్మించిన కేంద్రాన్ని సీఎం జగన్మోహన రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో సీఎం జగన్ పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

CM Jagan Live: విశాఖపట్నం రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ సంస్థ నూతనంగా నిర్మించిన కేంద్రాన్ని సీఎం జగన్మోహన రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో సీఎం జగన్ పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. నూతనంగా ఏర్పాటైన ఇన్ఫోసిస్ కార్యాలయం అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు.1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు అని సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో 4,160 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు.

విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సిఎం సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌, బెంగళూరు తరహాలో విశాఖలో కూడా మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. వైజాగ్‌ ఎడ్యుకేషనల్‌ హబ్‌గా మారిందని.. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు. విశాఖలో ప్రతిష్టాత్మక సంస్థాలు ఉన్నాయని, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలతో 12-15వేల మంది ఏటా ఇంజనీర్లు విశాఖ నుంచి వస్తున్నారని సీఎం చెప్పారు. అయితే డిసెంబర్ నుంచి తాను కూడా విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని అన్నారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారనున్నట్లు వెల్లడించారు.

Also Read: KTR reaction on Chandrababu Arrest : బిజెపి మద్దతుతోనే చంద్రబాబు అరెస్టు – కేటీఆర్ కామెంట్స్