CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని విధంగా సీట్లు రాబోతున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవ్వబోతోందని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని వివరించారు.ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదిగా పేర్కొనారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2019 లో గెలిచిన 151 సీట్ల కంటే అధికంగా వస్తున్నాయని జగన్ చెప్పుకొచ్చారు. 22 ఎంపీ సీట్లు వస్తున్నాయని లెక్క చెప్పారు. 2019 లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలిచింది. రానున్న రోజుల్లో వైసీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు. కాగా, ఎన్నికల్లో వైసీపీ కోసం ఐప్యాక్ పొలిటికల్ కన్సల్టెంట్ గా పని చేసిన విషయం తెలిసిందే.