ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం తాకట్టు పెట్టారు. సచివాలయంలో ఐదు బ్లాకులు (భవంతులు) ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
శాసన సభ, శాసనమండలి భవనాలు విడిగా ఉన్నాయి. ప్రస్తుతం సచివాలయంలోని ఐదు బ్లాకులు తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. అప్పు కోసం తొలుత ఐసీఐసీఐ బ్యాంకును ఆశ్రయించగా.. వారు అప్పు ఇవ్వమని చెప్పగా.. హెచ్‌డీఎ్‌ఫసీకి వెళ్లారు. ‘ఊరికే కాగితాలు చూపిస్తే సరిపోదు. సచివాలయ భవనాలను తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిస్తే… మొత్తం నిర్మాణ వ్యయంలో సగం అప్పుగా ఇస్తాం’ అని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడం తో గుట్టుచప్పుడు కాకుండా సచివాలయ భవనాలను హెచ్‌డీఎ్‌ఫసీకి తాకట్టు రిజిస్ట్రేషన్ చేసిచ్చేశారు. దీనిపై మాజీ సీఎం బాబు ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదని…. తెలుగు ప్రజల ఆత్మగౌరవమని.. రాష్ట్రానికి ఎంత అవమానకరం … ఎంత బాధాకరం… ఎంత సిగ్గు చేటు జగన్ రెడ్డీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? అంటూ మండిపడ్డారు. రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ (Brand of Andhra Pradesh)ని జగన్ నాశనం చేశారని.. ప్రజలారా… అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.
Read Also : Fruit: బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఈ ఒక్క పండు తినాల్సిందే?