Site icon HashtagU Telugu

AP: ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్…పోలీస్ రిక్రూట్ మెంట్ కు పచ్చజెండా..!!

Polavaram

Jagan Imresizer

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. దీపావళి కానుకగా రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 6,511పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్యకారదర్శి హరీశ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. హోంశాఖ కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం…ఏపీ పోలీస్ శాఖలోని సివిల్, రిజర్వ్ పోలీస్ విభాగాల్లో 6,511పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఇందులో 3,580 సివిల్ కానిస్టేబుల్స్, 315 ఎస్సై పోస్టులుకూడా ఉన్నాయి. ఇక రిజర్వ్ పోలీస్ విభాగంలో ఎపీపీఎస్సీలో 2520, కానిస్టేబుల్ పోస్టులు, 96 ఎస్ఐ పోస్టులు భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.