Jagan Strategy: గెలుపు గుర్రాలకే జగన్ ఛాన్స్.. సీఎం వ్యాఖ్యల మర్మమిదే!

ఒక్క ఎమ్మెల్యేను కూడా వదిలిపెట్టేది లేదని జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యల్లో పెద్ద మర్మం ఉందనీ

Published By: HashtagU Telugu Desk
Ammo Jagan, April's 'mood' Pulse

Ammo Jagan, April's 'mood' Pulse

ఏపీ సీఎం జగన్ ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించి రెండు రోజులైంది. అయితే ఈ భేటీపై చర్చలు ముగియలేదు. సీఎం జగన్ ఏం మాట్లాడారనే దానిపై హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. జగన్ అందరికీ హామీ ఇచ్చారు.  ఒక్క ఎమ్మెల్యేను కూడా వదిలిపెట్టేది లేదని జగన్ హామీ ఇచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక పెద్ద మర్మమే ఉందనీ రాజకీయ విశ్లేషకులు, ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి.

సమీక్షా సమావేశంలో తన రాజకీయాలు మానవ సంబంధాలతో నిండి ఉన్నాయని ఘాటుగా చెప్పారు. ఇది నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్నానని జగన్ అన్నారు. ప్రజలతో సంబంధాలు ఇంకా కొనసాగుతాయని చెప్పారు. ఈ విషయాలన్నీ సమావేశంలో ఎమ్మెల్యేలను సంతోషపెట్టాయి. చప్పట్లు కూడా కొట్టారు. అయితే ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న సందేశం దాగి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఎవరికైనా టిక్కెట్ రాకపోతే ఎమ్మెల్సీ సీటు లేదా కార్పొరేషన్ సీటు ఇస్తామని జగన్ చెప్పినట్లు సమాచారం. 2029లో సీట్లు పెరగనున్నందున వారందరికీ ప్రాధాన్యత కల్పిస్తారు.

తన ప్రసంగంలో అందరికీ టిక్కెట్టు వస్తుందని జగన్ హామీ ఇవ్వలేదు. రాని వారికి ఇతర మార్గాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కాబట్టి ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పని చేయని నేతల పేర్లు తన వద్ద ఉన్నాయని జగన్ పరోక్షంగా హింట్ ఇచ్చారా అనే విషయంపై అంతర్గతంగా చర్చ సాగుతోంది. 2029 ఎన్నికల నాటికి ఎమ్మెల్యే సీట్లు 225కి పెరుగుతాయని, మరో 50 సీట్లు వస్తాయని జగన్ చెప్పారు. తద్వారా 50 మంది నేతలకు టిక్కెట్లు రాని ప్రమాదం నెలకొంది.

50 మంది నేతలకు పార్టీ టిక్కెట్లు రాకపోవచ్చని, ఆరేళ్లు ఆగితే 2029 ఎన్నికల్లోనూ మళ్లీ అవకాశం వస్తుందని జగన్ పరోక్షంగా సూచించినట్లు చర్చ సాగుతోంది. వీరిలో కొందరికి ఇతర టిక్కెట్లు లభించే అవకాశం ఉంది. దీన్నిబట్టి జగన్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లు అర్థమవుతోంది. ప్రమాదంలో ఉన్న 50 మంది సభ్యులు ఎవరనేది మరో పెద్ద చర్చ. అయితే ఈసారి ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదని, జగన్ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరి ఆ 50 మంది నేతలు ఎవరనేది వేచి చూడాల్సిందే.

Also Read: President’s Rule: బండి అరెస్ట్ ఎఫెక్ట్.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన?

  Last Updated: 05 Apr 2023, 05:12 PM IST