CM Jagan: ఏపీలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. తీవ్ర ఆస్తినష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. పలుమార్లు ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ ఈ రోజు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం శ్రీ వైయస్.జగన్ వీడియో కాన్ఫరెన్స్ pic.twitter.com/d2zQotdAtE
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) August 3, 2023
వరద బాధితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. నాకు సహాయం అందలేదని ఏ ఒక్కరు కూడా చెప్పకుండా ప్రతిఒక్కరిని చేరదీయాలని సీఎం జగన్ చెప్పారు. మనం ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సహాయం అయితే ఆశిస్తామో, వరద ముంపుకు గురైన ప్రజలకు కూడా అదేస్థాయిలో చేయూత అందించాలి. వైద్య సదుపాయాలు చేపట్టాలి. త్రాగునీరు అందించాలి. మీరు నిర్వహించిన కార్యక్రమాలను నేను స్వయంగా వచ్చి పరిశీలిస్తానని సీఎం జగన్ అధికారులతో అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని చెప్పారు.