Site icon HashtagU Telugu

Jagan : అమ్మాయిలను లోబర్చుకొని పెళ్లిచేసుకోవడం.. నాలుగేళ్లు కాపురం చేసే వదిలేయడం ఇదే దత్తపుత్రుడి క్యారెక్టర్ – జగన్

CM Jagan Strongly Criticizes Pawan Kalyan

CM Jagan Strongly Criticizes Pawan Kalyan

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) మరోసారి చంద్రబాబు , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇదే అంటూ దారుణంగా కామెంట్స్ చేసారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం (YSR Nethanna Nestham) నిధులను సీఎం జగన్ విడుదల చేసారు, అనంతరం సభ లో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున రూ.194 కోట్లను జమ చేశామని , నేడు అమలు జరిగిన నేతన్న నేస్తం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు అందించినట్లు తెలిపారు. నేతన్న నేస్తం పథకానికి ఇప్పటి వరకు రూ.970 కోట్లు ఖర్చు చేశామని, నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 3,706 కోట్లు ఖర్చుచేసిందని జగన్‌ చెప్పుకొచ్చారు.

అలాగే వలంటీర్లఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. వలంటీర్లు అంతా ఆయా ప్రాంతాల ప్రజలకు సుపరిచుతులే. మన గ్రామం, మన ఊరు, మన ఇరుగు పొరుగు పిల్లలే.. మనవాళ్లే. ఇలాంటి వారిపై దత్తపుత్రుడు , చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వలంటీర్లు స్త్రీలను లోబరుచుకుంటారని ఒకడు అంటాడు.. గ్రామ వలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేస్తున్నారని నిసిగ్గుగా ఇంకోడు అంటాడు.. దీన్ని తాటికాయంత అక్షరాలతో సిగ్గులేని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు,

వలంటీర్ల క్యారెక్టర్‌ ఎలాంటిదో గ్రామాల్లో వారితో సేవలు అందుకుంటున్న కోట్లాది మందికి తెలుసు. అలాగే చంద్రబాబు క్యారెక్టర్‌ ఎలాంటిదో.. దత్తపుత్రుడి క్యారెక్టర్‌ ఎలాంటిదో.. ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్‌ ఎలాంటిదో.. ఆ బావమరిది క్యారెక్టర్‌ ఎలాంటిదో ప్రజలకు బాగా తెలుసనీ ఎద్దేవా చేసారు.

దత్తపుత్రుడు (Pawan Kalyan) అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు.. అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి వదిలేయడం అంటూ విరుచుకుపడ్డారు. పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారంటూ పవన్‌పై మండిపడ్డారు. అలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది.. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్‌ అంటూ ధ్వజమెత్తారు జగన్.

పట్టపగలే మందు తాగుతూ (Nara Lokesh) పది మంది అమ్మాయిలతో స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే డ్యాన్సులు చేసేవాడు ఇంకొకడు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే ఎంత నిసిగ్గుగా డ్యాన్స్‌లు చేస్తున్నాడో కనిపిస్తాడు. ఇంకొకరు (Balakrishna) అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దయినా పెట్టాలంట.. లేదా కడుపు అయినా చేయాలని ఇంకొక దౌర్భాగ్యుడు అంటాడు. మరో క్యారెక్టర్‌ వయసు 75 అయినా సిగ్గులేదు.. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడుతాడు.. ఆహా బావ నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజ జీవితంలోనే చేశానంటూ చేసిన వెదవ పనులను గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు అంటూ చంద్రబాబు , బాలకృష్ణ , నారా లోకేష్ లపై జగన్ విరుచుకపడ్డారు. క్యారెక్టర్‌ లేని వీరంతా మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడుతుంటే.. ఇది కలియుగం కాకుండా మరి ఏమిటీ.. అని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి , జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు , పవన్ , బాలకృష్ణల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : Chandrababu Naidu: పరువు గురించి ప్రభుత్వం మాట్లాడటం పెద్ద జోక్: చంద్రబాబు నాయుడు