Site icon HashtagU Telugu

CM Jagan: మూడున్నరేళ్లలో జగన్ కట్టిన ఇళ్లు 5 మాత్రమే!

AP Politics CM Jagan Mohan Reddy

Ap Cm Politics Jagan Mohan Reddy

మూడున్నరేళ్ళలో సీఎం జగన్ (CM Jagan) కట్టిన ఇళ్ళు ఎన్నో తెలిస్తే షాకే. కేవలం 5 ఇళ్లు మాత్రమే నిర్మించారు అంటే విస్తుపోవాల్సిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. కేఁద్ర నిధులతో చేపట్టే పీఎంఏవై (PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన) ఇళ్ళు ఏ రాష్ట్రం ఎన్ని నిర్మించింది ? ఏఏ రాష్ట్రానికి ఎంతమేరకు నిధులు ఇచ్చాం ? అనే విషయాన్ని రాజ్యసభ వేదికగా కేఁద్ర మంత్రి నిరంజన్ జ్యోతి వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 2 లక్షల 56 వేల 270 ఇళ్ళను కేఁద్రం కేటాయించింది. అంతేకాదు ఈ ఇళ్ళ నిర్మాణానికి నిధులను కూడా పూర్తిగా విడుదల చేసేసింది మోదీ సర్కార్ .

అయితే.. జగన్ (CM Jagan) సర్కార్ మాత్రం 2019 నుండి 2020 మధ్యలో కేవలం 5 అంటే ఐదు ఇళ్ళు మాత్రమే నిర్మించింది. 2020-21 మరియు 2021-22 సంవత్సరాల్లో “0” ఇళ్ళు, 2022-23 ఏడాదిలో 818 ఇళ్ళు మాత్రమే పేదలకు కట్టిచింది. 2,56,270 ఇళ్ళ నిర్మాణానికి నిధులు ఇస్తే…5+818 ఇళ్ళు అంటే… 823 ఇళ్ళు మాత్రమే కట్టి మిగిలిన నిధులు ఏమి చేసారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న .కేఁద్రం ఇచ్చే ప్రాజెక్టులు… రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు మాత్రం రాష్ట్రం వాటాగా ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వడంలేదు. రాజధానిలో కేఁద్ర సంస్థలు పెడతామన్నా… వాటికి కనీస మౌలికసదుపాయాలు కల్పించలేకపోతున్నారు.

Also Read:  Train: పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. మహిళకు తప్పిన ప్రమాదం