AP IPL Team: 2023 ఐపీఎల్ కథ ముగిసింది. ఈ సీజన్ టైటిల్ ని ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎత్తుకుపోయింది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అలాగే గుంటూరు కుర్రాడు , చెన్నై జట్టు ఆటగాడు అంబటి రాయుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో భాగంగా రాయుడు సీఎం జగన్ తో ఏపీలో క్రికెట్ గురించి చర్చించారు. ఏపీలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం జగన్ ని కోరినట్టు రాయుడు తెలిపాడు. అయితే రాయుడు అభ్యర్థనపై సీఎం జగన్ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఏపీ నుంచి కూడా జట్టుని సిద్ధం చేయాలనీ నిర్ణయించారు. దానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అవసరమైతే చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకత్వం తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
అంబటి రాయుడు, కేఎస్ భరత్‌లను స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది క్రికెటర్లను తయారు చేస్తామని అన్నారు సీఎం జగన్. ప్రారంభంలో సిఎస్కె కి కోచింగ్ బాధ్యతలను అప్పగిస్తామని, భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ జట్టు సహకారాన్ని కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడల్లో యువతను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ప్లే ఆంధ్రా’ రాష్ట్రవ్యాప్త క్రీడా ఉత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలలో నిర్వహించబడిన ఈ ఉత్సవంలో క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్, బ్యాడ్మింటన్, ఖో-ఖో మరియు ఇతర క్రీడలు ఉంటాయి.
Read More: India Squad: జూన్ 27న భారత జట్టు ప్రకటన.. సీనియర్లకు విశ్రాంతి.. యంగ్ ప్లేయర్స్ కి ఛాన్స్..!