స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ అయిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటనకు వెళ్లడంతో కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.
అంతకుముందు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖలు శకటాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశాయి.
Andhra Pradesh : రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం.. పాల్గొన్న సీఎం జగన్, మంత్రులు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని

ap raj bhavan
Last Updated: 15 Aug 2023, 08:25 PM IST