Site icon HashtagU Telugu

AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

AP Bus Accident

AP Bus Accident

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అశ్వరావుపేట నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా, జంగారెడ్డిగూడెంకు 10 కి.మీ దూరంలో బస్సు జల్లేరువాగులో పడిందని, ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా పది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉండగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

బస్సు వంతెన రెయిలింగ్ ను ఢీకొని 50 అడుగుల ఎత్తు నుండి జల్లేరువాగులో బోల్తా పడింది. క్రేన్ సహాయంతో బస్సును బయటకి తీశారు. ప్రమాదానికి గురైన బస్సు జంగారెడ్డిగూడెం డిపోకు చెందినదని అధికారులు తెలిపారు.

బస్సు ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన జగన్ ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని,
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా తగు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను‌ ఆదేశించారు.