Site icon HashtagU Telugu

RajBhavan : ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పరస్పరం ఎదురపడని సీఎం జగన్, చంద్రబాబు..!!

At Home

At Home

ఏపీ విజయవాడలోని రాజ్ భవన్ లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు. గవర్నర్ ఆహ్వానం అందుకుని ఎట్ హోం కార్యక్రమానికి విచ్చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, విపక్షనేత చంద్రబాబు దూరం దూరంగా కనిపించారు. ఎక్కడా కూడా ఒకరినొకరు ఎదురుపడలేదు. సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్…గవర్నర్ తో కలిసి ఓ టేబుల్ వద్ద కూర్చున్నారు. టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు మరో టేబుల్ మీద కూర్చున్న ద్రుశ్యాలు కనిపించాయి.

ఇక అసెంబ్లీలో తప్ప జగన్, బాబు ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. దాంతో మీడియా ఫోకస్ అంత కూడా ఎట్ హోం కార్యక్రమంపైన్నే నిలిచింది. అయితే వీరిద్దరూ పరస్పరం ఎదురుపడకుండానే కార్యక్రమం నుంచి వెనుదిరిగారు. ఎట్ హోం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో పలువురు హాజరయ్యారు.