AP New Cabinet: ఏపీ ‘కొత్త మంత్రుల’ శాఖలివే..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు.

  • Written By:
  • Updated On - April 11, 2022 / 05:37 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతంలో మాదిరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ వర్గాలకు డిప్యూటి సీఎంలుగా అవకాశం కల్పించారు. ఆంజాద్‌ బాషా, నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడులకు డిప్యూటి సీఎం పదవులు వరించాయి. డిప్యూటీ సీఎంలకు, ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..  

ఆంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం)

కొట్టు సత్యనారాయణ : దేవాదాయ శాఖ (డిప్యూటీ సీఎం)

రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం)

నారాయణ స్వామి :  ఎక్సైజ్‌ శాఖ (డిప్యూటీ సీఎం)

బూడి ముత్యాల నాయుడు : పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (డిప్యూటీ సీఎం)

అంబటి రాంబాబు : జలవనరుల శాఖ

ఆదిమూలపు సురేష్ ‌: మున్సిపల్‌ శాఖ, అర్బన్‌ డెవలప్‌మెంట్‌

బొత్స సత్యనారాయణ : విద్యాశాఖ

బుగ్గన రాజేంద్రనాథ్‌ : ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవరాహాల శాఖ

చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ : బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, ఐ అండ్‌ పీఆర్‌

దాడిశెట్టి రాజా : రోడ్లు, భవనాల శాఖ

ధర్మాన ప్రసాదరావు : రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌

గుడివాడ అమర్‌నాథ్‌ : పరిశ్రమల శాఖ

గుమ్మనూరు జయరాం : కార్మిక శాఖ

జోగి రమేష్‌ : గృహనిర్మాణ శాఖ

కాకాణి గోవర్థన్‌రెడ్డి : వ్యవసాయం, సహకార, మార్కెటింగ్‌ శాఖ

కారుమూరి వెంకట నాగేశ్వరరావు : పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ

ఉషాశ్రీ చరణ్‌ : స్త్రీ శిశు సంక్షేమ

మేరుగ నాగార్జున : సాంఘిక సంక్షేమ శాఖ

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ-పర్యావరణ శాఖ

పినిపే విశ్వరూప్‌ : రవాణా శాఖ

ఆర్కే రోజా : టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ

సీదిరి అప్పలరాజు : పశుసంవర్థక, మత్స్య శాఖ

తానేటి వనిత : హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

విడదల రజిని : వైద్యం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య